ఎన్టీఆర్ రేర్ ఫోటోను షేర్ చేసిన జక్కన ...మెరిసిపోతున్న మన్యం వీరులు...!!

ఎన్టీఆర్ రేర్ ఫోటోను షేర్ చేసిన జక్కన ...మెరిసిపోతున్న మన్యం వీరులు...!!

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఎన్టీఆర్ మెమోరీస్ తో కూడిన ఫోటోలు షేర్ చేశారు. ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన దర్శకుడు రాజమౌళి.  అందులో సందేహం అవసరం లేదు.  ఎన్టీఆర్ తో గతంలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తో రాజమౌళికి నాలుగో సినిమా.  

అయితే, ఎన్టీఆర్ తో కలిసి గతంలో చేసిన సినిమాకు సంబంధించిన ఫోటోను రాజమౌళి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.  సింహాద్రి సమయంలో ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరు గట్టిగా హత్తుకున్న ఫోటో అది.  అప్పటికి ఇప్పటికి ఎన్టీఆర్ లో చాలా మార్పులు కనిపించాయి.  ఇక ఇదిలా ఉంటె, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఓ ఫోటోను షేర్ చేశారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫోటో అది.  ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఇద్దరు మద్యం వీరులు కొదమసింహాల్లా ఉన్నారు. రామ్ చరణ్ షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ సెట్స్ లోని ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.