దట్ ఈజ్ రాజమౌళి సన్

దట్ ఈజ్ రాజమౌళి సన్

రాజమౌళి సినిమాలకు సహాయకుడిగా పనిచేస్తూ అనుభవం సంపాదించుకున్న ఆయన కుమారుడు కార్తికేయ... నిర్మాతగా మారి ఆకాశవాణి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  అశ్విన్ గంగరాజు దర్శకుడు.  ఈ సినిమాను కేవలం ఒకే ఒక షెడ్యూల్ లో పూర్తి చేశారు.  సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయడం ఒక రికార్డ్ అనే చెప్పాలి.  

తమిళ నటుడు సముద్రఖని తప్పా దాదాపుగా అందరు కొత్తవారే.  షూటింగ్ పూర్తి చేసుకున్నాక యూనిట్ గ్రూప్ ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  సినిమా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారట.