రాజమౌళి కుమారుడి పెళ్లి జరిగేది ఇక్కడేనా..?

రాజమౌళి కుమారుడి పెళ్లి జరిగేది ఇక్కడేనా..?

రాజమౌళి కుమారుడు కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  జనవరి 5 వ తేదీన వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  జగపతి బాబు సోదరుడి కూతురు పూజా ప్రసాద్, రాజమౌళి కుమారుడు కార్తికేయలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే.  వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారు.  సెప్టెంబర్ 5 వ తేదీన వీరి నిశ్చితార్ధం కూడా జరిగింది.  

ఇదిలా ఉంటె, ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు.  బాహుబలి సినిమాకు భారీ సెట్స్ ను నిర్మించిన రాజమౌళి, తన కుమారుడి పెళ్లి విషయంలో ఎలా రాజీపడతాడు.  భారీ స్థాయిలో పెళ్లిమండపం సెట్టింగ్ వేసి వివాహం చేస్తారని అనుకున్నారు.  అలా కాకుండా రాజమౌళి  రాజస్థాన్ లోని హోటల్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్ లో వీరి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారట.  250 ఎకరాల్లో ఈ ప్యాలెస్ నిర్మితమై ఉన్నది.  ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ వివాహాలు చాలా జరిగాయి.  మరి ఆ ప్యాలెస్ లో రాజమౌళి కుమారుడి వివాహం ఎంత కన్నుల పండుగగా నిర్వహిస్తారో.. ఎవరెవరు ఈ వివాహానికి హాజరౌతారో త్వరలోనే తెలుస్తుంది.