ఎన్టీఆర్ కు రాజమౌళి స్పెషల్ గిఫ్ట్

ఎన్టీఆర్ కు రాజమౌళి స్పెషల్ గిఫ్ట్

మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు.  ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకునేవారు.  ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  గతేడాది రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను పక్కన పెట్టేసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  

అభిమానుల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఎన్టీఆర్ కు దర్శకుడు రాజమౌళి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అన్నది అందరి మదిలో ఉన్న ఆలోచన. ఎన్టీఆర్... రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతోంది.  ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను చేస్తున్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫ్రీ లుక్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.  ఇదే నిజమైతే అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పండి.