ఎన్టీఆర్‌పై ఒక్క సీన్ కోసం 20 కోట్ల ఖర్చు !

ఎన్టీఆర్‌పై ఒక్క సీన్ కోసం 20 కోట్ల ఖర్చు !

రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకునేది హీరో ఇంట్రో సన్నివేశం గురించే.  హీరోలను తారా స్థాయిలో చూపిస్తూ రాజమౌళి తెరకెక్కించే పరిచయ సన్నివేశం ప్రతి సినిమాలోనూ గుర్తుండిపోయే రీతిలో ఉంటుంది.  ప్రస్తుతం చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో కూడా హీరోల కోసం అలాంటి సన్నివేశాలనే పెడుతున్నాడట జక్కన్న.  తాజా సమాచారం మేరకు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఇంట్రో సీన్ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చిస్తున్నారట.  అంటే ఆ సీన్ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.  ఇలాంటి సన్నివేశాలే సినిమాలో చాలా ఉన్నాయట.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల పైమాటే.