బ్రహ్మాస్త్ర గురించి రాజమౌళి ఏమన్నారంటే..!!

బ్రహ్మాస్త్ర గురించి రాజమౌళి ఏమన్నారంటే..!!

బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో బ్రహస్త్ర ఒకటి.  మైథలాజికల్, పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతోంది.  అమితాబ్, నాగార్జున, రన్బీర్ కపూర్, అలియా భట్ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన హిందీ మూవీ లోగోను రీసెంట్ గా ప్రయాగలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.  

కాగా, ఇప్పుడు తెలుగులో ఈ లోగోను రిలీజ్ చేశారు.  ఇండియాలో మొదటి మైథలాజికల్ త్రయాలజి డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లోగో వీడియోను రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.  బ్రహ్మాస్త్ర లోగో బాగుందని చెప్తూ.. సినిమా తప్పకుండా హిట్ కావాలని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.  

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.