'ఆర్ఆర్ఆర్' లాంచ్ కు అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ !

'ఆర్ఆర్ఆర్' లాంచ్ కు అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ !

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను అధికారికంగా ఈ నెల 11వ తేదీన లాంచ్ చేయనున్నారు.  ఈ వేడుకను భారీ ఎత్తున నివహించనున్నారు నిర్మాతలు. 

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్, స్టార్ హీరో ప్రభాస్ హాజరవుతాడని ఫిల్మ్ నగర్ టాక్.  మరి ఈ వార్తలో నిజమెంతనేది టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తేనే తెలుస్తుంది.  ఇకపోతే సినిమాలో హీరోయిన్లు ఎవరనే వివరాలు కూడ అదే రోజున తెలియనున్నాయి.