4 రోజులపాటు 'రాజన్న బడిబాట'

4 రోజులపాటు 'రాజన్న బడిబాట'

ఏపీలో ఇవాళ పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం.. ఇందుకోసం 'రాజన్న బడి బాట' కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'రాజన్న బడి బాట'లో భాగంగా నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సంబరాలు నిర్వహిస్తారు. పాఠశాలలను అందంగా అలంకరిస్తారు. జాతీయ గీతాలాపనతో బడి బాట ప్రారంభించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.