రేపటి నుంచి 'రాజన్న బడిబాట'

రేపటి నుంచి 'రాజన్న బడిబాట'

వేసవి సెలవులు ముగిశాయి.. సెలవుల్లో నాన్నమ్మ, తాత, అమ్మమ్మ.. లేదా మరో ఊరికి, బంధువుల ఇళ్లకు వెళ్లి ఎంజాయ్ చేసిన చిన్నారులు రేపటి నుంచి బడిబాట పట్టనున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిసారిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... దాని కోసం రేపటి నుంచి 'రాజన్న బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. తొలిరోజు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని స్కూళ్లలో సంబరాలు నిర్వహించాలని.. పాఠశాలలను సంప్రదాయ బద్దంగా అందంగా అలంకరించి జాతీయ గీతాలాపణతో బడిబాట ప్రారంభించాలని.. మూడురోజులు వివిధ కార్యక్రమాలతో సంబరాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించి ప్రభుత్వం.