ఇప్పుడేం మాట్లాడను: రాజశేఖర్‌

ఇప్పుడేం మాట్లాడను: రాజశేఖర్‌

గరుడవేగ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న సీనియర్‌ హీరో రాజశేఖర్‌.. కాస్త గ్యాప్‌ తీసుకుని 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సి.కల్యాణ్‌ నిర్మాణ సారథ్యంలో శివాని-శివాత్మిక సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రేపు రాజశేఖర్‌ బర్త్‌డే సందర్భంగా ఇవాళ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ 'కల్కి' గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడనని.. రిలీజైన తర్వాతే అన్ని విషయాలూ చెబుతానని అన్నారు.  'గరుడ వేగ' తర్వాత 6 నెలలు రకరకాల సబ్జెక్టులు వినీ.. చివరకు 'కల్కి' ఫైనల్ చేశామని చెప్పారు. ఈ సబ్జెక్ట్‌ ఓకే అయ్యాక  దర్శకుడు ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం వెయిట్ చేశామని.. చివరకు ఆయన కరుణించడంతో సినిమా ప్రారంభమైందని అన్నారు.