రాజశేఖర్ కల్కి టీజర్ రెడీ

రాజశేఖర్ కల్కి టీజర్ రెడీ

యాంగ్రీ యంగ్ మెన్ గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్ హీరోగా చేస్తున్న కల్కి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది.  ఆహుతి, అంకుశం, మగాడు తరహాలోనే ఈ కల్కి కూడా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్నది.  గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు.  అప్పట్లో ఈ టీజర్ ఆకట్టుకుంది.  ఆ తరువాత కల్కి కి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాలేదు.  

కాగా, ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 10:10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  నిన్నటి వరకు రాజకీయాల్లో బిజీ గా ఉన్న రాజశేఖర్ దంపతులు, ఈరోజుతో ప్రచారానికి తెరపడుతుండటంతో... కల్కిపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. అ వంటి వినూత్నమైన సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.