ఈ కల్కి.. యాంగ్రిగా ఉన్నాడు..!!

ఈ కల్కి.. యాంగ్రిగా ఉన్నాడు..!!

రాజశేఖర్ గరుడ వేగ సినిమా తరువాత చేస్తున్న సినిమా కల్కి.  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.  థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన గరుడవేగ సూపర్ హిట్ కావడంతో అదే జానర్లో మరో సినిమా చేయడానికి రాజశేఖర్ సిద్ధం అయ్యాడు.  అ వంటి థ్రిల్లింగ్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కల్కి టీజర్ ను రిలీజ్ చేశారు.  రైన్ ఫైట్ కు సంబంధించిన సీన్ అది.  ఈ ఫైట్ లో రాజశేఖర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.  మరి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.