నేషనల్ అవార్డ్ దర్శకునితో రాజశేఖర్..

నేషనల్ అవార్డ్ దర్శకునితో రాజశేఖర్..

సీనియర్ హీరోల్లో ప్రస్తుతం కొందరు లీడ్ రోల్స్ చేయకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒక వేలుగు వెలిగిన స్టార్స్ కూడా ప్రస్తుతం హీరోలుగా చేయలేమని అర్థం చేసుకొని విలన్స్ గా కూడా ట్రై చేస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ వంటి స్టార్స్ ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇదిలా ఉంటే సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ఆయన కొత్త సినిమా సంగతి ఎటూ తేలకుండా ఉంది. ‘భాయ్’ దర్శకుడు వీరభద్రం చౌదరితో సినిమా అన్నారు కానీ.. దాని గురించి ఏ అప్ డేట్ లేదు. కొందరేమో త్వరలోనే సినిమా మొదలవుతుందని అంటున్నారు. కొందరేమో ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉందంటారు. కానీ ఏ విషయం స్పష్టత లేదు.నిజానికి ఆయన ‘కల్కి’ తర్వాత కన్నడ హిట్ ‘కవులుదారి’ రీమేక్‌లో నటించాల్సింది. కానీ సినిమా అనౌన్స్ చేశాక దాన్నుంచి తప్పుకున్నారు.ఇక తాజా వార్త ఏమంటే.. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠ చెప్పిన ఓ కథకు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ కథ రాజశేఖర్‌కి చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.