ఊపందుకున్న రాజశేఖర్ 'కల్కి' !

ఊపందుకున్న రాజశేఖర్ 'కల్కి' !

'గరుడవేగ' చిత్రంతో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తెలివిగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు.  'అ !' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ చెప్పిన కథను విన్న రాజశేఖర్ చాలా రోజులు ఆలోచించి ఎట్టకేలకు ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

గత శనివారమే ఈ సినిమా లాంచ్ అయింది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.  ఇందులో హీరోయిన్ ఎవరు, సినిమా ఎలా ఉండబోతుంది వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.