సన్‌రైజర్స్‌ చిత్తు.. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

సన్‌రైజర్స్‌ చిత్తు.. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం..

టోర్నీలో నిలవాలంటే.. ప్లేఆఫ్స్‌లో ఆడాలంటే తప్పకుండా విజయం సాధించిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ విక్టరీ కొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. మనీష్‌ పాండే 61, వార్నర్‌ 37, విలియమ్సన్‌ 13, రషీద్‌ ఖాన్‌ 17 (నాటౌట్‌)పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అయితే, మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివున్న రాజస్థాన్‌.. అందులో ఒక్కటి ఓడినా ప్లేఆఫ్స్‌ రేసుకు దూరమవుతుంది. రహానె 39, లివింగ్‌స్టోన్‌ 44, సంజు శాంసన్‌ 48 (నాటౌట్‌), స్మిత్‌ 22 పరుగులు చేయడంతో రాజస్థాన్ విజయం సులువైంది. 
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటింగ్‌: వార్నర్‌ 37, విలియమ్సన్‌ 13, మనీష్‌ పాండే 61, విజయ్‌ శంకర్‌ 8, షకిబ్‌ 9, వృద్ధిమాన్‌ సాహా 5, రషీద్‌ ఖాన్‌ 17 (నాటౌట్‌), భువనేశ్వర్‌ కుమార్‌ 1, సిద్ధార్థ్‌ కౌల్‌ 0 (నాటౌట్‌)
రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌: రహానె 39, లివింగ్‌స్టోన్‌ 44, సంజు శాంసన్‌ 48 (నాటౌట్‌), స్మిత్‌ 22, టర్నర్‌ 3 (నాటౌట్‌)