ఐపీఎల్‌ బెట్టింగ్‌పై శిల్పాశెట్టి హ‌బ్బీ లీక్స్‌

ఐపీఎల్‌ బెట్టింగ్‌పై శిల్పాశెట్టి హ‌బ్బీ లీక్స్‌
2013లో ఐపీఎల్ బెట్టింగ్ వివాదం గురించి తెలిసిందే. చెన్న‌య్ సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్‌ల‌ను హైకోర్ట్ బ్యాన్ చేసింది. ఆ క్ర‌మంలోనే శిల్పా శెట్టి భ‌ర్త రాజ్‌కుంద్రాకు ఈ వ్యాపారంలో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో భారీగా పెట్టుబ‌డులు పెట్టిన కుంద్రా లైఫ్ బ్యాన్‌పై ఒక్క‌సారిగా కుదేలైపోయారు. ఆ క్ర‌మంలోనే అత‌డు సుప్రీంకోర్ట్‌లో బ్యాన్‌ని రివ్యూ చేయ‌మ‌ని పిల్ దాఖ‌లు చేశారు. అయితే దీనిపై తాజాగా ఇండియ‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స‌మావేశంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``ఐపీఎల్ బెట్టింగ్ వివాదంలో లైప్ బ్యాన్ వ్య‌వ‌హారంలో నేను ప‌రిస్థితుల్ని స‌రిగా ఎదుర్కోలేక‌పోయాను.. అది త‌ప్పేనని అర్థ‌మైంది`` అని వ్యాఖ్యానించారు. నేను నేరం చేశాను అన‌డానికి ఎలాంటి సాక్షాధారాలు లేవు. ఆ విష‌యంలో దిల్లీ పోలీసుల విచార‌ణ స‌రిగా సాగ‌లేదు. త‌ప్పుడు ఆధారాల‌తో శిక్ష అనుభ‌వించాల్సొచ్చింద‌ని ఆవేద‌న చెందారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కోవోన‌ర్‌గా రాజ్‌కుంద్రా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకునేందుకు ఆర్టీఐ చ‌ట్టం ఆధారంగా పోరాటం సాగించారు. 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. 2015లో దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ప్యానెల్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికీ అదే గిల్టీ ఫీలింగ్ రాజ్‌కుంద్రాను విడిచిపెట్ట‌డం లేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.