ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే హెల్మెట్ ఫ్రీ..!

ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే హెల్మెట్ ఫ్రీ..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారువాహనాల చట్టం గుదిబండగా మారుతోంది. ప్రభుత్వం సరైన రోడ్లు వేయదు.. మెరుగైన ఏర్పాట్లు ఉండవి.. కానీ, ఈ భారీ జరిమానాలు ఏంటని మండిపడుతున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం.. బైక్‌పై వెళ్లేవారికి బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం వాహనచోదకులకు ఫ్రీగా హెల్మెట్ అందిస్తారు. అయితే.. దీనికో షరతు కూడా ఉంది. అదేంటి అంటే ట్రాఫిక్ పోలీసులు విధించిన ఫైన్‌ను కట్టినవారికే ఇది వర్తిస్తుంది. అది మంచి క్వాలిటీతో ఉన్న హెల్మెట్ అందించాలని నిర్ణయించింది రాజస్థాన్ సర్కార్. 

వివరాల్లోకి వెళ్తే హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్లేవారు పట్టుపడితే.. వారికి ట్రాఫిక్ పోలీసులు రూ. వెయ్యి చలానా రాస్తారు.. ఇక, అది చెల్లించిన వారికి ఉచితంగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ను ఫ్రీగా ఇస్తారు. అంటే మార్కెట్‌లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు హెల్మెట్లు దొరుకుతున్నాయి... ఇక మంచి క్వాలిటీవి ఎంచుకుంటే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉన్నాయి.. మరీ స్టైలీష్ అంటే రూ.2వేల పైనే.. అయితే. రూ. వెయ్యి జరిమాని విధించి.. అది చెల్లించినవారికి హెల్మెట్ ఇవ్వడమంటే.. అదే ఫ్రీగా ఇచ్చినటే మరి. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటారువాహనాల యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధించమని రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటును పరిగణనలోకి తీసుకొని హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపిన వారి నుంచి వెయ్యిరూపాయల చలానా విధించి, వారికి ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మరోవైపు భద్రతపై ప్రజలను చైతన్యవంతులను చేసేలా మొదట నామమాత్రపు చలానాలు విధించాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.100గా ఉన్న జరిమానాను.. కొత్త చట్టం ప్రకారం రూ.వెయ్యకి పెంచి.. అది చెల్లించినవారికి ఉచితంగా హెల్మెట్ అందివ్వనున్నట్టు వెల్లడించారు.