'మై లార్డ్', 'యువర్ హానర్‌' నిషేధం..!

'మై లార్డ్', 'యువర్ హానర్‌' నిషేధం..!

కోర్టు అనగానే 'మై లార్డ్'.. 'యువర్ హానర్' పదాలు గుర్తుకు వస్తాయి... కానీ, ఈ పదాలపై నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాజస్థాన్ హైకోర్టు. ఇకపై ‘మై లార్డ్’, ‘యువర్ హానర్’ అనే పదాలు కోర్టులో వాడకూడదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోర్టులో వినియోగిస్తున్న చాలా పదాలు బ్రిటిష్ కాలం నాటివేనన్న హైకోర్టు... ‘మై లార్డ్’, యువర్ హానర్’ పదాలను వాడొద్దని ఆదేశించింది. హైకోర్టు సీజే రవీందర్ భట్టు నేతృత్వంలో జరిగిన కమిటీలో ఈ కీలక నిర్ణయానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ రెండు పదాలను వాడకూడదంటూ హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ నోటీసులు జారీ చేశారు. ఇక, అన్ని కోర్టుల్లో ఇది అమలు చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా, 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హెచ్ ఎల్ దత్తు మరియు ఎస్ ఎ బొబ్డేల ధర్మాసనం న్యాయవాదులను ఎలా పరిష్కరించాలో ఎంపిక చేసుకుందని చెప్పింది, కుర్చీకి గౌరవప్రదమైన చిరునామా మాత్రమే కావాలని కోర్టు స్పష్టం చేసింది. "న్యాయమూర్తులకు కావలసింది గౌరవప్రదమైన మార్గం. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ నా ప్రభువు లేదా ప్రభువు అని పిలవవలసిన అవసరం లేదు, మమ్మల్ని ‘సర్’ అని పిలవడం మాకు సరిపోతుంది, ”అని ధర్మాసనం పేర్కొంది.