కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత..!
అనారోగ్య సమస్యలతో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తావత్ కన్నుమూశారు.. ఆయన వయస్సు 48 సంవత్సరాలు.. గత కొంతకాలంగా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న గజేంద్రసింగ్.. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెలరోజుల నుంచి చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు. ఇక, ఇటీవల ఆయనకు కరోనా కూడా సోకినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలియాజేశారు. గజేంద్రసింగ్కు భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, గత ఏడాది జూలైలో రాజస్థాన్ రాజకీయ సంక్షోభ సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలిచారు శక్తావత్.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు జైపూర్‌కు తిరిగి రాకముందే తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిసి హర్యానాలో క్యాంప్ ఏర్పాటుచేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో వల్లభనగర్‌లో పూర్వపు రాజకుటుంబానికి చెందిన రణధీర్ సింగ్ బిందర్ను గజేంద్రసింగ్ ఓడించారు. అంతకుముందు 2008లో అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, తరువాత ఆయన రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక, ఆయన మృతి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్ దొతస్రా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్ సంతాపం తెలిపారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)