ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

ఐపీఎల్-11 లో భాగంగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎలాంటి చేంజెస్ లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ నెల 25న సన్‌రైజర్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు క్వాలిఫయర్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకి చాలా కీలకం. గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఆడాల్సిందే.

జట్లు:

కోల్‌కతా: క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్, నితీశ్ రానా, అండ్రే రస్సెల్, శుభ్‌మాన్ గిల్, జావన్ సీర్‌లెస్, పీయూష్ చావ్లా, ప్రశీద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.

రాజస్థాన్: రాహుల్ త్రిపాఠి, అజింక్యా రహానే, సంజూ శాంసన్, హెన్రిచ్ క్లాసెన్, కృష్ణప్ప గౌతమ్, సువర్ట్ బిన్ని, జోఫ్రా ఆర్చర్, ఇష్ సోదీ, జయదేవ్ ఉనద్కట్, శ్రేయస్  గోపాల్, బెన్ లిఫ్లిన్.

Photo: FileShot