ఐపీఎల్ 2021 : రాయల్స్ లక్ష్యం ఎంతంటే...?

ఐపీఎల్ 2021 : రాయల్స్ లక్ష్యం ఎంతంటే...?

రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై బ్యాట్స్మెన్స్ ను రాయల్స్ బౌలర్లు కొంత ఇబ్బందే పెట్టారు. అయితే చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10) మరోసారి విఫలమైన ఆ తర్వాత మొయిన్ అలీ(26) తో కలిసి డు ప్లెసిస్(33) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక వారు పెవిలియన్ చేరుకున్న తర్వాత వచ్చిన రైనా, రాయుడు అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిన చెన్నై కెప్టెన్ ధోని 17 బంతుల్లో 18 పరుగులు చేసి మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన డ్వేన్ బ్రావో వేగంగా ఆడటంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా క్రిస్ మోరిస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్    రెండు వికెట్లు రియాన్ పరాగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే రాజస్థాన్ రాయల్స్ 189 పరుగులు చెయ్యాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.