ఐపీఎల్ 2020 : విజయోత్సాహంతో ఉన్న రెండు జట్లు...

ఐపీఎల్ 2020 : విజయోత్సాహంతో ఉన్న రెండు జట్లు...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో విజయం సాధించిన ఉత్సహంతో రెండు జట్లు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. అయితే పంజాబ్ జట్టుకు ఇది మూడో మ్యాచ్. మొదటి మ్యాచ్ ఢిల్లీ పై అంపైర్ తప్పిదం కారణంగా ఓడిపోయిన ఈ జట్టు తర్వాత రెండో మ్యాచ్ లో ఆర్సీబీ పై 97 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో సెంచరీ తో మంచి ఫామ్ లో ఉన్నాడు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఇక పంజాబ్ ఆడిన ఈ రెండు మ్యాచ్ లలోను ఈ జట్టు విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఆడలేదు. కానీ ఈ మ్యాచ్ లో గేల్ ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజం అయితే పంజాబ్ బ్యాటింగ్ మరింత బలపడినట్లే చెప్పచు.

ఇక ఈ ఏడాది టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ కు ఇది రెండో మ్యాచ్ మాత్రమే. మొదటి మ్యాచ్ చెన్నై పై ఆడి భారీ స్కోర్ చేసింది. దాంతో 16 పరుగుల తేడాతో ఆ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక ఈ జట్టులో కూడా మొదటి మ్యాచ్ ఆడని స్టార్ బాట్స్మెన్ జోస్ బట్లర్ ను ఈ మ్యాచ్ లో ఆడించాలని రాయల్స్ యాజమాన్యం చూస్తుంది. ఇప్పటికే ఈ జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజు సామ్సన్ మంచి టచ్ లో ఉన్నారు. వీరికి బట్లర్ కూడా తోడైతే ఈ మ్యాచ్ లోను రాజస్థాన్ భారీ స్కోర్ చేసే అవకాశముంది. అంటే ఈ రోజు మ్యాచ్ లో రెండు జట్ల తరపున బ్యాటింగ్ ప్రదర్శనే ఎక్కువగా చూసే అవకాశం ఉంది. అయితే విజయోత్సాహంతో ఈ మ్యాచ్ లో పాల్గొంటున్న ఈ జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది చూడాలి.