ముంబయిపై రాజస్థాన్ విజయం

ముంబయిపై రాజస్థాన్ విజయం

జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ (59, 48 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్నాడు. సంజుశాంసన్‌(35, 19 బంతుల్లో 6ఫోర్లు,1సిక్స్), రియాన్‌ పరాగ్‌ (43, 29 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో రాజస్థాన్ సునాయసంగా విజయం సాధించింది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ‌(5) వెనుదిరిగాక..  క్వింటన్‌ డికాక్‌(65, 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్ లు), సూర్యకుమార్‌ యాదవ్‌(34, 33 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) ఆచితూచి ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాక సూర్య పెవిలియన్‌ చేరాడు. కొద్దిసేపటికే డికాక్‌, పొలార్డ్‌(10) కూడా ఔటయ్యారు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య (23) దూకుడుగా ఆడడంతో ముంబయి స్కోరు 160 పరుగులు దాటింది.