రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ః 161

రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ః 161

జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఆటగాడు మనీష్ పాండే (61 పరుగులు, 36 బంతుల్లో, 9 ఫోర్లు ) చెలరేగి ఆడాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ (37 పరుగులు, 32 బంతుల్లో) మనీష్ పాండేకు చక్కటి సహకారం అందించాడు. కెప్టెన్ కేన్ విలియమ్ సన్ (13 పరుగులు, 14 బంతుల్లో ) నిరాశపరిచారు. విజయ్ శంకర్(8), షకీబ్ అల్ హసన్(9), దీపక్ హుడా(0), వృద్ధీమాన్ సాహా(5), రషీద్ ఖాన్(17), భువనేశ్వర్ కుమార్ (1), సిద్దార్ద్ కౌల్ (0 నాటౌట్ ) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. రాజస్ధాన్ బౌలింగ్ లో వరణ్ ఆరోన్, థోమస్, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనాథ్కడ్ తలో రెండు వికెట్లు తీశారు. 

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. లివింగ్‌స్టోన్, టర్నర్‌లకు తుది జట్టులో స్థానం కల్పించినట్టు చెప్పిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఇక, హైదరాబాద్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేన్ విలియమ్సన్, సిద్ధార్థ్ కౌల్, వృద్ధిమాన్ సాహాలు జట్టులోకి వచ్చారు.