ఐపీఎల్ 2020 : సన్ రైజర్స్ కు షాక్... మ్యాచ్ గెలిచిన రాయల్స్...

ఐపీఎల్ 2020 : సన్ రైజర్స్ కు షాక్... మ్యాచ్ గెలిచిన రాయల్స్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఇందులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ మనీష్ పాండే (54), వార్నర్ (48) రాణించడంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక 159 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ మొదట తడబడింది. రాజస్థాన్ టాప్ ఆర్డర్ మొత్తం నిరాశ పరిచిన రియాన్ పరాగ్(42), రాహుల్ టెవాటియా(45) చేసి జట్టుకు విజయం అందించారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ ను పరాగ్ సిక్స్ తో ముగించాడు. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో  రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఏడో స్థానంలో ఉన్న రాయల్స్ ఆరో స్థానంలోకి వస్తే ఈ పరాజయంతో కూడా సన్‌రైజర్స్ ఐదో స్థానంలో ఉంది.