రికార్డ్ ఛేదన...మయాంక్ సెంచరీ వృధా... 

రికార్డ్ ఛేదన...మయాంక్ సెంచరీ వృధా... 

షార్జా వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 223 పరుగు చేసింది.  రాహుల్ 69, మయాంక్ అగర్వాల్ 106 పరుగులు చేశారు. ఓపెనర్లు రాణించడంతో పంజాబ్ జట్టు భారీ స్కోర్ సాధించింది.  224 పరుగుల భారీ స్కోర్ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది చెన్నై మ్యాచ్ లో రాణించిన సంజు శాంసన్, స్మిత్ లో ఈ మ్యాచ్ లో కూడా రాణించారు.  సంజు శాంసన్ 83, స్మిత్ 50 పరుగులతో పాటుగా రాహుల్ తెవాతియా 53 పరుగులు చేయడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి వరసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈ సీజన్ లో రాజస్థాన్ జట్టు దూకుడుగా ఆడుతున్నది.  మొదటి మ్యాచ్ లో చెన్నైపై 211 పరుగులు చేయగా, రెండో మ్యాచ్ లో పంజాబ్ పై 223 పరుగుల లక్ష్యాన్ని సైతం ఛేదించింది.  పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ సెంచరీ వృధా అయ్యింది.  మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఓడినప్పటికీ పోరాటపటిమను కనబరిచి ఆకట్టుకుంది.