ఐపీఎల్ 2021 : రాయల్స్ కు విజయం అందించిన మోరిస్...

ఐపీఎల్ 2021 : రాయల్స్ కు విజయం అందించిన మోరిస్...

ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాయల్స్ కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. మొదట జట్టు ఓపెనర్లు ఇద్దరు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరగా ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ సంజు కూడా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్(62) అర్ధశతకంతో రాణించాడు. మరోవైపు ఆటగాళ్లు అందరూ పెవిలియన్ కు లైన్ కట్టిన మిల్లర్ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన  క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 27 పరుగులు అవసరం ఉండగా నాలుగు  సిక్స్ లు బాది మరో రెండు బంతులు ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఇక అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ పై విజయంతో రాయల్స్ ఈ ఐపీఎల్ లో తమ ఖాతాను తెరచ్చింది.