ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

ఐపీఎల్ 2020 లో 9వ మ్యాచ్ ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ షార్జా వేదికగా జరగనుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో ఆడని ఈ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. దాంతో ఈజట్టు బ్యాటింగ్ బలం పెరిగింది అనే చెప్పాలి. అయితే షార్జా మైదానం చిన్నది. కాబట్టి పంజాబ్ రాజస్థాన్ కు భారీ లక్ష్యాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. పంజాబ్ ఆడిన గత రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న గేల్ ఈ మ్యాచ్ కూడా దూరంగానే ఉండనున్నాడు. ఇక చూడాలి మరి ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది.

పంజాబ్ జట్టు : మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్ (w/c), నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషామ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్

రాజస్థాన్ జట్టు : జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (c), సంజు సామ్సన్ (w), రాబిన్ ఉతప్ప, రాహుల్ టెవాటియా, రియాన్ పరాగ్, టామ్ కుర్రాన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, అంకిత్ రాజ్‌పూట్