బయోపిక్‌ల విడుదలపై రజత్‌కుమార్‌ క్లారిటీ..

బయోపిక్‌ల విడుదలపై రజత్‌కుమార్‌ క్లారిటీ..

రాజకీయ నేతల బయోపిక్‌ల విడుదలపై ఇప్పటి వరకు ఎటువంటి అభ్యంతరాలూ లేవని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇవాళ 'ఎన్టీవీ'తో ఆయన మాట్లాడుతూ బయోపిక్‌లపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదన్న ఆయన.. ఒకటికి రెండుసార్లు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతే పోలింగ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సరైన సమయానికే ఎన్నికల తేదీని ఈసీ ప్రకటించిదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తేదీ మార్పు కుదరదని రజత్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతోపాటు అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.