ఓట్ల లెక్కింపుపై రజత్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు

ఓట్ల లెక్కింపుపై రజత్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని.. కౌంటింగ్‌ ప్రక్రియ కూడా ప్రశాంతంగా పూర్తి చేస్తామని ఎన్నకల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.  రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అబ్జర్వర్ సమక్షంలో లెక్కిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లక్కింపు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల నిఘా మధ్యలో వీవీ ప్యాట్ల నుంచి లాటరీ తీసి లెక్కిస్తామని చెప్పారు.

ఈవీయంలు పనిచేయని పక్షంలో వీవీ ప్యాట్లను లెక్కలోకి తీసుకోబోమని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. వీవీ ప్యాట్లకు రీకౌంటింగ్‌ అవకాశం ఉంటుందని.. ఈవీఎంలకు మాత్రం రీకౌంటింగ్‌ ఉండదని వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఏదైనా సమస్య, సందేహం ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు మినహా ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.