సునీల్ చెప్పిన బైక్ ఆత్మకథ

సునీల్ చెప్పిన బైక్ ఆత్మకథ

అనగనగా ఓ షెడ్ ఆ షెడ్ లో బాడీ లేని హెడ్ లైట్... సౌండ్ లేని సైలెన్సర్.. టైర్లు లేని చక్రాలు..ఇలా సునీల్ వాయిస్ చెప్పుకుంటూ పోతుంది.  బైక్ వాయిస్ చెప్పడం ఏంటి అనే డౌట్ రావొచ్చు.  మర్యాద రామన్న సినిమాలో సైకిల్ లో రవితేజ వాయిస్ వచ్చినపుడు బైక్ లో సునీల్ వాయిస్ రావడంలో తప్పులేదు.  

బైక్ అంటే ఇష్టపడే ఓ యువకుడు.. అందులోను రాజదూత్ బైక్ అంటే ఇష్టపడే ఓ యువకుడు ఆ బైక్ కోసం ఎక్కడెక్కడికో తిరుగుతాడు.  చివరికి ఆ బైక్ ఉన్న చోటు తెలుసుకొని కొనుగోలు చేస్తాడు.  ఆ బైక్ వలన కలిగిన ఇబ్బందులు ఏంటి.. సమస్యలు ఏంటి అన్నది కథ.  శ్రీహరి కొడుకు మేఘాంశ్ నటించిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.