వెయ్యి కోట్ల రారాజు

వెయ్యి కోట్ల రారాజు

రజినీకాంత్.. బాక్స్ ఆఫీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు.  సినిమా హిట్టా ఫట్టా అన్నది సంబంధం లేదు.  రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే.. కలెక్షన్లు సునామీలా వచ్చేస్తాయి అంతే.  ఈ క్రేజ్ ను దర్శక నిర్మాతలు యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు.  రజినీకాంత్ తో సినిమా చేస్తే.. అదృష్టంగా భావిస్తున్న చాలామంది దర్శకులు రజిని ఇంటిముందు క్యూ కడుతున్నారు.  

యావరేజ్ గా నిలిచిన కాలా సినిమా సైతం భారీ వసూళ్లు సాధించింది.  నవంబర్ 29 వ తేదీన రిలీజైన 2పాయింట్ 0 ఎన్నో రికార్డులు సాధించింది.  బాహుబలి తరువాత ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధించిన సినిమా 2పాయింట్ 0 నే. ఫిబ్రవరిలో చైనాలో రిలీజ్ కాబోతున్నది.  అక్కడ హిట్టయితే.. మరెన్నో రికార్డులు 2పాయింట్ 0 ఖాతాలో పడిపోతాయి.  

ఈ సంక్రాంతికి రజినీకాంత్ పెట్ట సినిమాతో సందడి చేశాడు.  రజిని ఈజ్ బ్యాక్ అన్నట్టుగా సినిమా ఉంది.  69 సంవత్సరాల వయసులో రజిని చాలా యాక్టివ్ గా కనిపించడమే కాదు.. గతంలో మాదిరి ఫైట్స్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.  ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  రూ. 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన రజిని నాలుగో సినిమా ఇది.  ఈ ఎనిమిది నెలల్లో రజిని సినిమాలు రూ.1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాయి.