రజిని పిక్స్ నెట్టింట్లో వైరల్

రజిని పిక్స్ నెట్టింట్లో వైరల్

రజినీకాంత్ హీరోగా చేస్తున్న దర్బార్ మూవీ షూటింగ్ రీసెంట్ గా ముంబైలో ప్రారంభమైంది.  రజిని పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.  సినిమా కథ ఎక్కువగా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందట.  కథను మలుపుతిప్పే పాత్రలో నయనతార కనిపిస్తుందని తెలుస్తోంది.  రజినీకాంత్ రేంజ్ కు తగ్గట్టుగా సినిమా ఉంటుందని దర్శకుడు మురుగదాస్ చెప్తున్నాడు.  

ముంబైలో షూటింగ్ లొకేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.  రజినీకాంత్ లుక్ కుసంబంధించిన ఫోటోలు కావడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి.  చాలా కాలం తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.