వండర్... ఆ 53 సరసన రజినీకాంత్ సినిమా

వండర్... ఆ 53 సరసన రజినీకాంత్ సినిమా

ఈ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.  అందులో కొన్నే సక్సెస్ అయ్యాయి.  ఆ కొన్నింటిలోను అతి కొద్ది సినిమాలే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలు 53 ఉంటె.. ఇందులో ఇండియా నుంచి రెండు సినిమాలు మాత్రమే ఆ లిస్ట్ లో చేరాయి.  అందులో ఒకటి అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్. చైనా వసూళ్లతో కలుపుకొని వంద మిలియన్ డాలర్లు వసూలు చేసింది.  

ఈ లిస్ట్ లో చేరిన రెండో సినిమా రజినీకాంత్ 2 పాయింట్ 0.  నవంబర్ 29 న రిలీజైన ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2పాయింట్ 0 చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్నది.