రజనీ, జగపతి కాంబో మూడోసారి అయినా వర్కవుట్ అవుద్దా!?

రజనీ, జగపతి కాంబో మూడోసారి అయినా వర్కవుట్ అవుద్దా!?

మాస్ చిత్రాల దర్శకుడు శివ ప్రస్తుతం ‘అన్నాత్తే’ తెరకెక్కిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో సన్ పిక్చర్స్ తో రజనీ ‘ఎంథిరన్’, ‘పెట్టా’ మూవీస్ చేశాడు. ‘రోబో, పేట’ టైటిల్స్ తో ఇవి రెండూ తెలుగులోనూ మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. తలైవర్ రజనీకాంత్ తో సన్ పిక్చర్స్ మూడో సినిమా ‘అన్నాత్తే’. అయితే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మన హైద్రాబాద్ లో జరుగుతుండగా యూనిట్ లో కరోనా కలకలం రేగింది. నలుగురికి పాజిటివ్ రిపోర్ట్స్ రావటంతో షెడ్యూల్ ఆగిపోయింది. రజనీకాంత్ అపోలో హాస్పిటల్ లో వైద్యం తరువాత చెన్నై వెళ్లిపోయారు.

ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తమిళనాడులోనే ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే అనేక జాగ్రత్తల నడుమ రజనీకాంత్ సెట్స్ మీదకి వెళ్లాడని కోలీవుడ్ టాక్. తిరిగి షూటింగ్ ప్రారంభించిన వెంటనే ‘అన్నాత్తే’ టీమ్ ఓ సర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ చేసింది. మన టాలీవుడ్ అందగాడు, స్టైలిష్ విలన్ గా దూసుకుపోతోన్న జగపతి బాబు సూపర్ స్టార్ సినిమాలో కనిపిస్తాడట. కీలక పాత్రలో ఆయన నటిస్తారని అఫీషియల్ గా ట్వీట్ చేశారు. అయితే, ‘అన్నాత్తే’లో విలన్ జగపతిబాబేనా? లేక ఆయనది మరేదైనా పాత్రా? దీనిపై క్లారిటీ లేదు! ఇంతకు ముందు జగపతి బాబు, రజనీకాంత్ కలసి నటించిన చిత్రాలు ‘లింగ, కథానాయకుడు‘. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి మూడోసారి రజనీ, జగపతి కలసి ట్రై చేస్తోన్న ‘అన్నాత్తే’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? లెట్స్ వెయిట్ అండ్ సీ...