రజినీకాంత్.. కమల్.. ఓ మల్టీస్టారర్

రజినీకాంత్.. కమల్.. ఓ మల్టీస్టారర్

రజినీకాంత్.. కమల్ హాసన్ లు కలిసి అనేక సినిమాలు చేశారు.  కె బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమాలు వచ్చాయి.  వీరిద్దకు కలిసి నటించిన ఆఖరి సినిమా ఉరువవుగల్ మరాళం.  1983 వ సంవత్సరంలో వచ్చింది ఈ మూవీ.  ఆ తరువాత ఇద్దరు కలిసి సినిమా చేయలేదు.  అప్పటికే ఇద్దరు కలిసి దాదాపు 13 సినిమాల్లో నటించారు.  

దాదాపు అన్ని సినిమాలు హిట్ కొట్టాయి.  ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద స్టార్స్ గా ఎదగడంతో... ఇమేజ్ కారణంగా కలిసి సినిమాలు చేయలేకపోయారు.  అయితే, ఒకరి సినిమాను ఒకరు ప్రోత్సహించుకుంటూ సపోర్ట్ చేసుకున్నారు.  ఇప్పుడు ఈ ఇద్దరు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.  కమల్ ఇప్పటికే పార్టీ పెట్టడం అందులో బిజీ కావడం జరిగిపోయింది.  రజినీకాంత్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు.  

రాజకీయాల్లోకి వచ్చే వరకు వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలన్నది ఆయన లక్ష్యం. అయితే, కమల్ హాసన్ రెండో కూతురు అక్షరా హాసన్ కు ఓ కల ఉందట.  అదేమంటే రజినీకాంత్.. కమల్ హాసన్ లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందట.  దానికి అక్షరా హాసన్ దర్శకత్వం వహించాలని కలలు కంటోంది.  సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు అక్షరాహాసన్ దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేసిన సంగతి తెలిసిందే.  మరి ఆమె కల నెరవేరుతుందా..!!