'అన్నాత్తే' షూటింగ్  మొదలయింది...!

'అన్నాత్తే' షూటింగ్  మొదలయింది...!

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం, కరోనా కలకలంతో అర్ధాంతరంగా ఆగిపోయింది ‘అన్నాత్తే’. డైరెక్టర్ శివ దర్శకత్వంలో... తలైవా నటిస్తోన్న క్రేజీ చిత్రం... ఎట్టకేలకు మళ్లీ మొదలైందట! నవంబర్ 4 రిలీజ్ చేసేందుకు చకచకా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్! గత డిసెంబర్ లో రజనీకాంత్ హైద్రాబాద్ లోనే అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన రక్తపోటుతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతే కాదు, ‘అన్నాత్తే’ యూనిట్ లో నలుగురికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటం అప్పట్లో కలకలం రేపింది. తలైవా వైరస్ బారిన పడకున్నా హాస్పిటల్ తప్పలేదు. మానసిక, శారీరిక ఒత్తిడి కారణంగా పొలిటికల్ ఎంట్రీ కూడా పర్మనెంట్ గా క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే, అలా ఆగిపోయిన మూవీ షూటింగ్ ఇప్పటి వరకూ మళ్లీ మొదలు కాలేదు. అయితే, 2021 నవంబర్ 4న విడుదల చేస్తామని నిర్మాతలు గతంలో ప్రకటించటంతో ఇప్పుడు చెన్నైలోనే షుటింగ్ స్టార్ట్ చేశారట... తమిళంలో ‘అన్నాత్తే’ టైటిల్ తో తెరకెక్కుతోన్న సూపర్ స్టార్ సినిమా ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల అవ్వనుంది. పైగా ఈసారి రజనీతోపాటూ నయనతార, మీనా, ఖుష్బు లాంటి సీనియర్ యాక్ట్రెస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యంగ్ బ్యూటీ కీర్తి సురేశ్ కూడా కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, సతీశ్, సూరీ, జార్జ్ మరియన్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ‘అన్నాత్తే’కి సంగీతం డీ. ఇమ్మాన్ అందిస్తున్నాడు. ‘దర్భార్’ తరువాత తలైవా తెరపై కనిపించబోతోన్న సినిమా ఇదే!