రజనీకాంత్ సంచలన నిర్ణయం.. నో పాలిటిక్స్..!

రజనీకాంత్ సంచలన నిర్ణయం.. నో పాలిటిక్స్..!

తమిళసూపర్‌ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు... ఊరించిఊరించి తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని ప్రకటించిన రజనీ.. ఈ నెల 31వ తేదీన పార్టీని ప్రకటించడానికి సిద్ధమయ్యాడు... కానీ, తాజాగా ఆయన అనారోగ్యంబారినపడ్డారు.. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సూపర్ స్టార్.. సినియా యూనిట్‌లో కొందరికి కోవిడ్‌ రావడంతో షూటింగ్‌ రద్దు చేసుకున్నారు. క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.. ఉన్నట్టుండి హైబీపీతో అస్వస్థతకు గురైన రజనీ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.. అన్ని టెస్టులు చేసి రజనీ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు వైద్యులు. అనంతరం చెన్నైకి వెళ్లిపోయిన రజనీకాంత్‌పై అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది... కుటుంబసభ్యులతో పాటు.. అభిమానులు సైతం మనకు రాజకీయాలు వద్దు అని తలైవాపై ఒత్తిడి తెచ్చినట్టుగా ప్రచారం జరిగింది.. ముఖ్యంగా రజనీ ఇద్దరు కుమార్తెలు వద్దంటే వద్దూ.. మనకు పాలిటిక్స్ వద్దూ అంటూ మారం చేసినట్టు వార్తలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు రజనీకాంత్.. తన ప్రకటనలో రాజకీయాలకు నో చెప్పిన రజనీ... ఈ నెల 31 న పార్టీ ప్రకటన లేదని స్పష్టం చేశారు.. అనారోగ్య కారణాల దృష్ట్యా పాలిటిక్స్ కి తాను దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చారు. 

తనపై నమ్మకం ఉంచిన వ్యక్తులను బలిపశువుగా భావించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రజనీకాంత్.. తన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి జరిగిన పరిణామాలు దేవుని హెచ్చరికగా తీసుకుంటానని, 2021 తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ పతనానికి తన ప్రణాళికలతో ముందుకు సాగలేనని తెలిపారు.. అధిక రక్తపోటుతో బాధపడుతూ చికిత్స పొంది.. హైదరాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు రోజుల తర్వాత రజనీకాంత్ చేసిన ప్రధాన ప్రకటన ఇది.. 70 సంవత్సరాల వయసున్న రజనీకాంత్ కిడ్నీ సంబంధిత సమస్యలు, లేబుల్ హైపర్‌టెన్షన్ మరియు వయస్సు పైబడడం.. దృష్టిలో ఉంచుకుని ఒత్తిడిని నివారించడానికి ఒక వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్‌లో ఉండాలని సూచించారు వైద్యులు. ఈనే పథ్యంలో రజనీ ప్రకటన కీలకంగా మారింది.