పొలిటిక‌ల్ ఎంట్రీ...! మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన‌ సూప‌ర్ స్టార్

పొలిటిక‌ల్ ఎంట్రీ...! మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన‌ సూప‌ర్ స్టార్

కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఊరించి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ ప్ర‌క‌టించిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. చివ‌రి క్ష‌ణాల్లో తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.. అయితే, ఈ ప్ర‌క‌ట‌న‌ను ర‌జ‌నీ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌న రాజీకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు నిర్వ‌హిస్తున్నారు.. దీంతో.. తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానులకు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. తాను రాజకీయాల్లోకి రానని, ఆరోగ్య కార‌ణాలతో రాజ‌కీయాల్లోకి రాలేన‌ని.. తన నిర్ణయాన్ని తాను ఇది వరకే వివరించానని చెప్పిన తలైవా.. దయచేసి ఇంకెవ్వరూ తనను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దంటూ కోరారు. అభిమానులు ర్యాలీలు, ధ‌ర్నాలు నిలిపివేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన ర‌జ‌నీకాంత్.. రాజ‌కీయ ఎంట్రీపై మ‌న‌సు మార్చుకునే అవ‌కాశం లేద‌ని మ‌రోసారి క్లారిటీ ఇస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు‌.