మహేష్ చేతుల మీదుగా రిలీజైన రజినీకాంత్ దర్బార్ మోషన్ పోస్టర్ 

మహేష్ చేతుల మీదుగా రిలీజైన రజినీకాంత్ దర్బార్ మోషన్ పోస్టర్ 

సౌత్ సూపర్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ కొద్దీ సేపటి క్రితమే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.  రజినీకాంత్ పోలీస్ గెటప్ లో యాక్షన్ సీన్ ఉన్న మోషన్ పోస్టర్ అది.  ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న మోషన్ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నది.  ఎప్పటిలాగే అనిరుద్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాడు.  

రజినీకాంత్ దర్బార్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉందని, దర్బార్ యూనిట్ కు మహేష్ శుభాకాంక్షలు తెలిపాడు.  తమిళంతో పాటుగా తెలుగు,మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్.