రజనీకాంత్ కోసం మరోసారి

రజనీకాంత్ కోసం మరోసారి

రజనీకాంత్ సినిమాలకు ఓ సెంటిమెంట్ ఉంది.  ఆ సెంటిమెంట్ ను ఫాలో అయిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  ఫాలో కానీ సినిమాలు ప్లాప్ అయ్యాయి.  అందుకే ఆ సెంటిమెంట్ ను దర్బార్ సినిమాలో ఫాలో కావాలని చూస్తున్నారు. మాములుగా రజినీకాంత్ సినిమాలకు ఓపెనింగ్ సాంగ్ బాలసుబ్రమణ్యం తో పాడిస్తారు.  ఇలా చేయడం వలన సినిమాలు హిట్ అవుతాయని వారి నమ్మకం.  ఆ నమ్మకమే ఇప్పటి వరకు నిలబడుతూ, బలపడుతూ వచ్చింది.  పెట్ట సినిమాలో కూడా సాంగ్ లోని కొన్ని పదాలు మాత్రమే బాలసుబ్రహ్మణ్యం పాడారు.  మిగతాది వేరే సింగర్ పాడటంతో ఫ్యాన్స్ కొంత అసహనానికి లోనయ్యారు.  

అయితే, ఇప్పుడు రజనీకాంత్ కొత్త సినిమా దర్బార్ విషయంలో అలా జరగకుండా చూసుకోవాలని చూస్తున్నారు.  దర్బార్ సినిమాలోని ఇంట్రో సాంగ్ ను బాలసుబ్రహ్మణ్యం చేత పాడించబోతున్నారట. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దాదాపు 25 సంవత్సరాల తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.