మురుగదాస్ తెలివైన ప్లాన్.. రజిని దర్బార్ అనుకున్నదానికంటే ముందుగానే..!!

మురుగదాస్ తెలివైన ప్లాన్.. రజిని దర్బార్ అనుకున్నదానికంటే ముందుగానే..!!

మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమా దర్బార్.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.  రజినీకాంత్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.  ఈ సినిమాను మొదట జనవరి 10 వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు.  కానీ, జనవరి 12 నుంచి వరసగా టాలీవుడ్లో మహేష్, బన్నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 

బన్నీ, మహేష్ లు టాలీవుడ్ లో పెద్ద స్టార్స్.  యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది.  కాబట్టి రజినీకాంత్ సినిమాకు వసూళ్లు పరంగా ఇబ్బంది వస్తుంది.  థియేటర్ల పరంగా కూడా ఇబ్బంది రావొచ్చు.  అందుకే ఈ సినిమాను జనవరి 10 వ తేదీ కంటే ఒకరోజు ప్రీఫోన్ చేసి జనవరి 9 వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా తెలిపింది.  ఇది రజిని అభిమానులకు పండుగే అని చెప్పాలి.