తలైవా దర్బార్ న్యూలుక్... క్షణాల్లో వైరల్

తలైవా దర్బార్ న్యూలుక్... క్షణాల్లో వైరల్

సౌత్ లో రజినీకాంత్ కు ఉన్నఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సరైన కాంబినేషన్ కుదిరి.. హిట్ పడింది అంటే.. మిగతా సినిమాలు ఏవి కూడా దరిదాపుల్లో ఉండవు.  మాస్ లో పిచ్చ క్రేజ్ ఉంటుంది.  ఒక్క సౌత్ లోనే కాదు.. అటు నార్త్ లో కూడా రజినీకి ఫాలోయింగ్ ఎక్కువ.  విదేశాల్లో సైతం అయన సినిమాలు గిరాకీ ఎక్కువ. 

ప్రస్తుతం రజినీకాంత్ స్టార్ దర్శకుడు మురుగదాస్ తో దర్బార్ సినిమా చేస్తున్నాడు.  దీనికి సంబంధించిన న్యూ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ మూవీలోని రెండు స్టిల్స్ ను రిలీజ్ చేశారు.  ఒకటి పోలీస్ గెటప్లో ఫైట్ చేస్తున్న ఫోటో కాగా, రెండోది స్టైలిష్ గా కోటు ధరించిన ఫోటో.  ఈ రెండు రిలీజైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాను షూట్ చేస్తున్నారు.  దాదాపు 25 ఏళ్ల తరువాత రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నయనతార హీరోయిన్.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.