68 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా సూపర్ స్టార్ ఫైట్..!!

68 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా సూపర్ స్టార్ ఫైట్..!!

68 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  ఇప్పటికే ఈ హీరో కబాలి నుంచి వరసగా సినిమాలు చేస్తున్నారు.  కబాలి, కాలా, 2పాయింట్ 0, పేట ఇప్పుడు దర్బార్.  ఆ వయసులో కూడా యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్న హీరో అయన.  దర్బార్ షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  

ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  దాదాపు 25 ఏళ్ల తరువాత మరలా పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న సినిమా ఇది.  ముంబై మాఫియా నేపథ్యంలో జరుగుతున్నది.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్ ను ఇటీవలే షూట్ చేశారు.  రజినీకాంత్ షర్ట్ లేకుండా బ్లాక్ కలర్ బనీన్ వేసుకొని సీరియస్ గా ఫైట్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.