ఆ ముగ్గురికి ఫాల్కే ఆవార్డ్ అంకితమిచ్చిన రజనీకాంత్...

ఆ ముగ్గురికి ఫాల్కే ఆవార్డ్ అంకితమిచ్చిన రజనీకాంత్...

దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ ను కేంద్రప్రభుత్వం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు చిత్రరంగ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియచేశారు. అయితే తనకు లభించిన ఈ పురస్కారాన్ని తన కెరీర్ తొలిరోజుల్లో ఎంతగానో ప్రోత్సహించిన వారికి అంకితం ఇచ్చి తన మంచితనాన్ని చాటుకున్నారు రజనీకాంత్. బస్ కండక్టర్ గా పనిచేసే రోజుల్లో తనలోని యాక్టింగ్ టాలెంట్ ను పసిగట్టి ప్రోత్సహించిన బస్ డ్రైవర్ రాజ్ బహుదూర్తో పాటు తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన తన అన్న సత్యనారాయనరావు గైక్వాడ్, అలాగే రజనీకాంత్ అనే తనను క్రియేట్ చేసిన తన గురువు కె. బాలచందర్ కు ఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నట్లు చెప్పారు రజనీకాంత్. ఇక తమిళ చిత్రపరిశ్రమలో శివాజీగణేశన్, బాలచందర్ తర్వాత ఈ అవార్డ్ అందుకోబోతున్న మూడో వ్యక్తి రజనీకాంత్ కావటం విశేషం.