రజినీకాంత్  అభిమానుల ఆందోళన... పార్టీ ప్రకటించాలని నినాదాలు 

రజినీకాంత్  అభిమానుల ఆందోళన... పార్టీ ప్రకటించాలని నినాదాలు 

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, డిసెంబర్ 31 వ తేదీన పార్టీని, జనవరిలో పార్టీకి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తానని డిసెంబర్ మొదటివారంలో ప్రకటించారు.  అయితే, డిసెంబర్ 25 వ తేదీన రజినీకాంత్ అన్నతే షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురికావడంతో, కుటుంబసభ్యుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్నారు.  రజినీకాంత్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు షాక్ అయ్యారు.  రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులు రజినీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు చెన్నైలో భారీ సంఖ్యలో అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు.  రజినీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని, వెంటనే పార్టీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.