ఐపీఎల్‌ మ్యాచ్‌లో రజనీకాంత్‌ మానియా

ఐపీఎల్‌ మ్యాచ్‌లో రజనీకాంత్‌ మానియా

ఐపీఎల్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సందడి చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిన్న రాత్రి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు - చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కి విచ్చేసిన ర‌జ‌నీకాంత్‌.. అభిమానుల మ‌ధ్య కూర్చొని మ్యాచ్‌ని వీక్షించారు. రజనీకాంత్‌ గ్యాలరీలో ఉండడంతో ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. తలైవాతో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. క్రికెటర్లు ఎంతమంది ఉన్నా.. ఫాలోయింగ్‌లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడీ సూపర్‌స్టార్‌.