రజనీకాంత్ ఆరోగ్యం పై హెల్త్‌ బులిటెన్ విడుదల..

రజనీకాంత్ ఆరోగ్యం పై హెల్త్‌ బులిటెన్ విడుదల..

తమిళ సినీ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర రక్తపోటుకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రిలో చేరారు.  అయితే.. తాజాగా రజనీ కాంత్ ఆరోగ్యం పై లెటెస్ట్ మెడికల్ బులిటెన్ ను అపోలో ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం రజనీ కాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన హై బిపితో ఇబ్బంది పడుతున్నారని హెల్త్‌ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు. రజనీకాంత్‌కు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.  వైద్య పరీక్షల తర్వాత.. అన్నీ బాగుంటే ఆయనను సాయంత్రానికి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.  రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు విజ్ఞప్తి చేశారు.