రజినీ ఐకాన్ వెనుక అంతటి రాజకీయం ఉందా?

రజినీ ఐకాన్ వెనుక అంతటి రాజకీయం ఉందా?

రజినీకాంత్ సౌత్ సూపర్ స్టార్... రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే... సౌత్ ఇండియా మొత్తం పండుగ చేసుకుంటుంది.  ఒక్క సౌత్ లోనే కాదు.. అటు బాలీవుడ్లో కూడా రజినీకాంత్ కు మంచి పేరు ఉన్నది.  గత కొంతకాలంగా రజినీకాంత్ పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి.  వార్తలు వస్తున్నా... ఇప్పటి వరకు దానిపై రజినీకాంత్ స్పందించడం లేదు.  రాజకీయాలోకి వస్తానని చెప్తున్నా ఎప్పుడు వస్తారో అన్నది క్లారిటీ లేదు.  

కాగా, ఒకవేళ రాజకీయాల్లోకి రజినీకాంత్ రావాలని అనుకుంటే.. సొంతంగా పార్టీ పెట్టేబదులుగా రజినీకాంత్ ను బీజేపీలో మమేకం చేసేలా చూసేందుకు నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.  దానికోసం అనేకమంది బీజేపీ నేతలు రజినీకాంత్ తో మంతనాలు జరుపుతున్నారు.  రజినీకాంత్ ద్వారా బీజేపీ తమిళనాడులో అడుగుపెట్టాలని చూస్తున్నది. ఇదిలా ఉంటె, రజినీకాంత్ కు కొన్ని కేంద్రం ఐకాన్ సిల్వర్ జూబ్లీ అవార్డును ప్రకటించింది.  రజినీకి ఈ అవార్డును ప్రకటించడం వెనుక ఇదే కారణం కావొచ్చని రాజకీయ సినీ విశ్లేషకులు చెప్తున్నారు.  మరి రజినీకాంత్ బీజేపీతో కలుస్తారా లేదంటే సొంతంగా పార్టీ పెడతారా చూద్దాం.