రజనీకాంత్ కండక్టర్ కాదు కార్పెంటర్

రజనీకాంత్ కండక్టర్ కాదు కార్పెంటర్

సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టోరీ ఏమిటని అడిగితే చాలామంది ఆయన మొదట్లో ఒక సాధారణ బస్ కండక్టర్ అని, అక్కణ్ణుంచి సినిమాల్లోకి ప్రవేశించి, కష్టపడి సూపర్ స్టార్ అయ్యారని చెబుతారు.  కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రజనీ కండక్టర్ ఉద్యోగానికంటే ముందు కార్పెంటర్‌గా పనిచేసి ఆ తర్వాతే ఆయన కండక్టర్ అయ్యారు.  ప్రస్తుతం ఈ విషయం తమిళనాడు 5వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉండే పేదవారి స్థాయి నుండి గొప్పవారిగా ఎదిగిన వ్యక్తులు అనే పాఠ్యాంశంలో ఉంది.  అంటే రజనీ హార్డ్ వర్క్ పుస్తకాల్లోకి ఎక్కిందన్నమాట.